సూర్యాపేట:హత్య రాజకీయాలు తో ప్రజా ఉద్యమాలను ఆపలేవు అని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి సామినేని రామారావు హత్య ఘటన అత్యంత ఆందోళన కలిగించే విధంగా ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు.
ఆయనమృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అనేక ప్రజా ఉద్యమాలకు రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించిన రామారావు ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామాల్లో ఈరోజు తెల్లవారుజామున కాంగ్రెస్ మూకల కిరాయి గుండాలు అత్యంత కిరాతకంగా చంపారు సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా పార్టీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారని అన్నారు. పాతర్లపాడు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా రెండు సార్లు ప్రజాప్రతినిధిగా పనిచేశారని చెప్పారు.గ్రామంలో రాజకీయంగా సిపిఎం ను ఎదుర్కోలేని కాంగ్రెస్ గుండాలు కిరాయి గుండాలు తో చoపించారని ఆవేదన వ్యక్తం చేశారు.సౌమ్యుడు ప్రజలలో కలిసి పోయే మనిషిగా పేరు ఉంది అనేక ఉద్యమాలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా నిర్వహించిన సందర్భంలో అంకితభావంతో పనిచేశారని చెప్పారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని చెప్పారు.
