కోదాడ ఎం ఎల్ ఏ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ఎం ఎల్ ఏ పద్మావతి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కంభంపాటి శ్రీను, కాలేజ్ ప్రిన్సిపల్ వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపాల్ జీ వీ, మైనం రామయ్య, నాయకులు నెమ్మది సురేష్, పాలడుగు సంజీవ్, గంధం జాని, గజ్జి మస్తాన్, డేగల విజయ్ తదితరులు పాల్గొన్నారు .

next post