Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్‌కు ‘కల్చరల్ పార్టనర్ అవార్డ్’ – ప్రచారం మీడియా ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు–2025’

హైదరాబాద్, డిసెంబర్ 23 : ప్రచారం మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్త్రీ శక్తి ప్రతిభ పురస్కారాలు – 2025’ కార్యక్రమంలో ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్ సంస్థకు కల్చరల్ పార్టనర్ అవార్డ్ ను ప్రదానం చేశారు. ఈ అవార్డును శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల విదేశీ రాయబార కౌన్సిలర్ ప్రతినిధులు చేతుల మీదుగా ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ స్టడీస్ సంస్థ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఎం.వి. సతీష్ కుమార్ స్వీకరించారు. భారతీయ సంస్కృతి, సంస్కృత భాష, ప్రాచీన భారత జ్ఞాన పరంపరల పరిరక్షణలో ఏకదంత సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశామని నిర్వాహకులు ప్రచారం మీడియా సంస్థ చైర్మన్ మధు నాయుడు తెలిపారు. ఆధునిక తరానికి అర్థమయ్యే విధంగా సంస్కృత భాషా అధ్యయనం, భారతీయ ప్రాచీన విద్యలను పరిచయం చేయడంలో ఈ సంస్థ విశేషంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏకదంత వెబ్‌సైట్ ద్వారా వేలాది మంది విద్యార్థులు ఉచితంగా సంస్కృతం నేర్చుకుంటున్నారు.

“సంస్కృతము నేర్చుకుందాం – మన సంస్కృతిని తెలుసుకుందాం” అనే నినాదంతో సంస్థ ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మేడ్చల్ పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, ప్రముఖ నృత్యకారిణి గెడ్డం పద్మజ, దేశీ–విదేశీ అతిథులు పాల్గొన్నారు.

Related posts

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs

శ్రావణమాస మొదటి శుక్రవారం ప్రత్యేక పూజలకు పోటెత్తిన మహిళలు

TNR NEWS

విమాన ప్రమాద మృతులకు నివాళులు

TNR NEWS

బెల్లంకొండ వెంకయ్య చిత్ర పటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

Harish Hs

కోదాడ వాసికి డాక్టరేట్ ప్రధానం

Harish Hs

క్రెడాస్ సేవలు వినియోగించుకోవాలి 

TNR NEWS