కాకినాడ : బహు బాషా కోవిధుడు, బహుముఖ ప్రజ్ఞశీలి కవి శేఖర డా.ఉమర్ ఆలీషా అని వారి ముత్తాత గారిని ప్రస్తుత పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ బాషణ చేసారు. శుక్రవారం ఉదయం స్థానిక బోట్ క్లబ్ వద్ద శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్ట పీఠాధిపతి కవి శేఖర డా. ఉమర్ ఆలీషా 81వ వర్ధంతి కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత నవమ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా, కాకినాడ పురపాలక సంఘ అడిషనల్ కమిషనర్ కె.టి.సుధాకర్ ముఖ్య అతిధులు గాను, పీఠాధిపతి సోదరులు అహ్మద్ ఆలీషా సభాద్యక్షులు గాను, కబీర్ షా, హుస్సేన్ షా, కవి శిరీష, తురగా సూర్యారావు, బలరామ కృష్ణ మాస్టారు, ఎ.వి.వి.సత్యనారాయణ, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు సభలో పాల్గొని ప్రశాంగించారు. ఆలీషా తమ 16వ యేటనే బ్రహ్మ విద్యా విలాసం అనే శతకాన్ని, మణిమాల అనే నాటకాన్ని రచించారు అని సభాధ్యక్షులు అహ్మద్ ఆలీషా అన్నారు. కబీర్ షా మాట్లాడుతూ సర్వ మతాల సామరస్యాన్ని, సంఘ సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. హుస్సేన్ షా మాట్లాడుతూ సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన ఆలీషా గారు, తనకు తానే సాటినని, మేటినని నిరూపితం చేసుకున్నారు. కవి శిరీష, బలరామ కృష్ణలు పాడిన గేయాలు సభికులను అల్లరింప చేసాయి. ఎ.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ఆలీషా గారు విశ్వ కవిగా ప్రకటింప బడ్డారని అన్నారు. పీఠాధిపతి డా. ఉమర్ అలీషా స్వామి వారు మాట్లాడుతూ భారతీయ సమాజం గర్వించదగ్గ ఉమర్ ఆలీషా గారు ఆంధ్రదేశ సాహిత్య, సామజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక రంగాల్లో ఆచంద్రార్క యశస్విగా నిలిచిపోయారని అన్నారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ ఆలీషా గారి బాటలో నడవడం లక్షలాది వారి శిష్యులు వారికీ ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. ప్రారంభంలో ప్రస్తుత పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి ముత్తాత గారైన కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహానికి గజ పుష్ప మాల అలంకరించి, జ్యోతి ప్రజ్వలన చేసి, సభనుద్దేశించి ప్రసంగించారు. అహ్మద్ ఆలీషా అతిధులను సత్కరించారు. హారతితో సభ ముగిసింది. ఈ కార్యక్రమంలో ఉమర్ ఆలీషా పురస్కార గ్రహీత కవి, ప్రముఖ సాహితివేత్త డా. అఫ్సర్, స్థానిక కమిటీ సభ్యులు ఎల్లమాంబ, రెడ్డి సూర్య ప్రభావతి, బాదం లక్ష్మి కుమారి, వనుము మణి, వీరభద్రరావు, సత్తిబాబు, ఉప్పల నూకరత్నం, ఎస్.కె.అమీర్ బాషా, పలువురు యువతి యువకులు, పీఠం సభ్యులు పాల్గొన్నారు.
