కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం సాధారణ ఓటర్ గా నమోదు కు ఈ నెల 28వ తేదీ తుది గడువు ఉందని ఈ అవకాశాన్ని జనవరి 1వ తేదీకి 18 సం” వయస్సు లోకి వచ్చే ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ వెల్లడించారు. శని, ఆదివారాల్లో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం లో భాగంగా ఆదివారం తడి హిప్పర్గ, సోనాల, మద్నూర్ గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్ ను పరిశీలించారు. *MLC ఎన్నికలకు ఓటర్ గా నమోదు కు మరోసారి అవకాశం.*
MLC టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓటర్ గా నమోదు కు మరో సారి అవకాశం ఇచ్చినట్లు తహసిల్దార్ వెల్లడించారు. నేటి నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తుది గడువు ఉందని తెలిపారు.ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం లో గిర్దవార్ శంకర్, సూపర్ వైజర్ రవి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.