Tnrnews.in
తెలంగాణరాజకీయం

అవినీతి బి ఆర్ ఎస్ ను భూస్థాపితం చేస్తాం… – మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్

 

టిఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే అందరమెక్కి 10 సంవత్సరాల పాటు పందికొక్కుల దోచుకున్నారని మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ అన్నారు.శనివారం ఆత్మకూరు మండలం నీరుకుల్లా గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి ఓర్వలేని టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. మీ అవినీతి అక్రమాలకు గుట్టు రట్టు చేసి ప్రజల ముందు ఉంచుతామన్నారు. పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా అభివృద్ధి కంటే దోపిడీ ఎక్కువ జరిగిందని. ప్రజలపై దాడులు దౌర్జన్యాలు చేస్తూ భయభ్రాంతులను గురిచేసి దోచుకున్నది మీరు కాదని ప్రశ్నించారు. మీ అవినీతి అక్రమాలను చూసిన తెలంగాణ ప్రజలు చీదరించుకొని ఛీ కొట్టిన కూడా బుద్ధి రావడం లేదన్నారు. గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనం కార్పొరేట్ విద్యను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. సన్న చిన్న కారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పంట రుణాలను మాఫీ చేసి వారి గుండెల్లో చిరిగిన ముద్ర వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్కా సుమలత మాజీ జెడ్పిటిసి కక్కెర్ల రాధిక రాజు గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, పరకాల నియోజకవర్గం అసెంబ్లీ యూత్ కమిటీ ఉపాధ్యక్షులు మాదాసి శ్రీధర్, పిఎసిఎస్ డైరెక్టర్ ఉడుత రాజేందర్ మానగాని సాంబమూర్తి అలకంటి రణవీర్ ఎగితే లింగయ్య, గుండెబోయిన శ్యామ్, తనువుల సందీప్, పొనుగోటి సత్యనారాయణ,నాగరాజు తదితరులుపాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

TNR NEWS

రణభేరి సభకు తరలి వెళ్లిన ఆర్యవైశ్యులు

Harish Hs

సర్వే కు ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలి  బి.శ్రీనివాస్,కమీషనర్ 

TNR NEWS

జీవనది ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

TNR NEWS

రూ.2.94 లక్షల కోట్ల తో ఏపీ వార్షిక బడ్జెట్

TNR NEWS

మనుషులే కాదు… జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి అలాంటి దృశ్యం….కెమెరా కళ్ళకు చిక్కింది… శివలింగానికి ఓ శివయ్య నా మాట వినయ్యా…. అని మొక్కుతున్న వానరం

TNR NEWS