కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అనంతరం పాఠశాలల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.