మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామం లో అంబేద్కర్ చౌరస్తా వద్ద అమ్మాపురం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కాసోజు శ్రీకాంతా చారి 15 వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ మలి దశ ఉద్యమం లో తెలంగాణ కోసం డిసెంబర్ 3వ తేదిన తన ప్రాణం త్యాగాలు చేసిన విషయం తెల్సిందే.ఈ కార్యక్రమం లో భాగంగా మంగళవారం రాత్రి క్రొవత్తులు వెలిగించి శ్రీకాంతా చారి అమరహే అంటూ కాసోజు శ్రీకాంతా చారి కి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధి మాజీ MPTC ముద్దం విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ…శ్రీకాంతా చారి ఆత్మ బలిధానం తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఆయువు పట్టయిందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను గౌరవించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గట్టు రాంబాబు, బూరుగు వీరేష్, కోటగిరి సంతోష్,పబ్బోజు వెంకన్న,పబ్బోజు శ్రీనివాసాచారి, వెంకటరమణా చారి, పబ్బోజు భరత్ కుమార్, పబ్బోజు ప్రవీణ్ శర్మ, నరేష్, రవి, పాక యాకన్నా తదితరులు పాల్గొన్నారు.