కోదాడ పట్టణంలోని మాతా నగర్ లో శుక్రవారం ముందస్తు సెమీ క్రిస్మస్ వేడుకలు పాస్టర్ సుందర్ రావు కుమారుడు మాడుగుల రాహుల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట తెదేపా నాయకులు శ్రీరామ్ చిన్నబాబు, జయరాములు పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు చూపిన బోధనలు క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమ, సదా అనుసరణీయమని వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ సుందర్ రావు,స్థానిక కౌన్సిలర్ షాబుద్దీన్, మామిడి రామారావు,గంధం పాండు,రాహుల్ గుండు,ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు………