చేవెళ్ల మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేవెళ్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు మల్గారి కార్తీక్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ జిల్లా నాయకులు తనకు మండల పదవిని కట్టబెట్టడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. కష్టపడే వారికి ఫలితం ఉంటుందని, అందుకు నిదర్శనం తనకు కేటాయించిన బాధ్యతే అంటూ వ్యాఖ్యానించారు. తనపై పెట్టిన ఈ బాధ్యత పట్ల మండల స్థాయిలో పదవికి వన్నే తెచ్చేలా రాబోయే రోజుల్లో మండల వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ తరపున ప్రజల పక్షాన నిలిస్తానని తెలిపారు.
previous post