Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గరినే ఉమా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన గరినే ఉమామహేశ్వరి ఏకగ్రీవంగా నియమితులైనట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పైడిమర్రి నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయంగా, ఆర్యవైశ్య సామాజికపరంగా నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న వైశ్యరత్మ గరినే కోటేశ్వరరావు కోడలైన ఉమామహేశ్వరికి జిల్లా స్థాయి అవకాశం రావడం పట్ల పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి తనకు అప్పగించిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని, మహాసభ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా తెలియజేస్తూ జిల్లాలోని ఆర్యవైశ్య మహిళల ఐక్యతకు కృషి చేస్తానని ఉమామహేశ్వరి తెలిపారు ఆర్యవైశ్య మహిళలను రాజకీయంగా చైతన్య పరిచేందుకు తన వంతు కృషిచేసి సంఘ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఆమె ఎన్నికపై జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి రమేష్, గారినే శ్రీధర్ ,వంగవీటి శ్రీనివాసరావు, పబ్బిశెట్టి సతీష్, దివ్వెల రామారావు, గుడుగుంట్ల శ్రీనివాసరావు, తవిడిషెట్టి నాగేశ్వరరావు, ఓరుగంటి పాండు యాద సుధాకర్, వైశ్య యువజన సంఘ నాయకులు యిమ్మడి అనంత చక్రవర్తి, డాక్టర్ వంగవీటి భరత్ చంద్ర, ఓరుగంటి నిఖిల్ ,బెలిదే భరత్, వంగవీటి శరత్చంద్ర, అవోప కార్యవర్గం, వాసవి క్లబ్స్ బాధ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు….

Related posts

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

TNR NEWS

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS

TNR NEWS

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs

గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర

TNR NEWS

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంఘటన సభ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని మడుపు మోహన్ విజ్ఞప్తి

TNR NEWS