కోదాడ: డిసెంబర్ 19న వాహనాల వేలంపాట నిర్వహించనునట్లు కోదాడ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ నాటు సారాయి, బెల్లం కేసుల్లో పట్టుబడి, సీజ్ చేసిన (02) వాహనాలు (ఆటో, బొలెరో ) కోదాడ ఎక్సైజ్ స్టేషన్ నందు బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. బహిరంగ వేలం పాటలో పాల్గొనాలనుకునే వారు అదే రోజు ఉదయం 9 గంటలకు స్టేషన్ నందు ముందుగా ధరావతు చెల్లించాలి అన్నారు.
previous post