మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానీ అన్నారు. సోమవారం కోదాడ ఏంవిఐ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమం కల్పించి మాట్లాడారు.. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్క వాహనదారుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వాహనదారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాహనాలు సీజ్ చేసి లైసెన్సులు కూడా రద్దు చేస్తామని వాహన దారులను హెచ్చరించారు. అక్కడికి వచ్చిన వాహనదారులతో ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.