కాకినాడ : వసుంధర తేజమైన ధరణిని రక్షించి పోషించే మూర్తిగా సమస్త దేవతా స్వరూప గోమాతలను కాచి పాలించిన వసుంధరునిని గోవిందా గోవింద అని మనసారా పిలిచే నామం అత్యంత మహిమాన్వితమని గణపతి పీఠం పేర్కొంది. గోవింద నామాలు పఠిస్తే వేద పురాణ ఉపనిషత్తుల విజ్ఞాన సర్వస్వం అవగతమవుతుందన్నారు. సుప్రభాత వేళలో గోవింద నామాలు వింటే ప్రగతికిసిద్ధి కలుగుతుందన్నారు. శనివారం ఉదయం కాకినాడ సూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో శ్రీవారి పాదాల వద్ద 73వ జపయజ్ఞ పారాయణ జరిగింది. శ్రీవారి తిరునామాన్ని ప్రతిష్టచేసి సహస్ర నామాలతో పూజించారు. మహిళ లకు రవిక,గాజులు, పసుపు, కుంకుమ కరతోరణతాంబూలాలు ప్రధానం చేసారు. కళ్యాణ శ్రీకరం జరిగిన పెండ్లి కుమార్తెను చిరంజీవి సౌభాగ్యవతిగా పేరంటాళ్ళు ఆశీర్వదించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ శ్రీవారి పాదాల వద్ద 7వారాల దీపారాధన చేసుకున్న 9మంది కన్యలకు వివాహ మూహుర్తాలు శ్రీకరం అయ్యాయని తెలిపారు. మరో 35వారాలు పూర్తయిన తరువాత అక్టోబర్ ఆఖరివారంలో శ్రీవారి భక్తులతో తిరుమల బస్సు యాత్ర జరుగుతుందన్నారు. శ జపయజ్ఞ పారాయణ లో బియ్యపు పిండి, బెల్లం, అరటిపండు గుజ్జు మిశ్రమంతో తయారు చేసుకున్న 7ప్రమిదల్లో 7వారాల పాటు ఆవు నెయ్యితో దీపారాధన చేసిన దంపతులతో శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల దివ్య కల్యాణాన్ని పీఠం నిర్వహిస్తుందన్నారు.

next post