మూలస్థాన అగ్రహారం (ఆలమూరు) : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గౌతమీ గోదావరి తీరాన కొలువైయున్న శ్రీ షిరిడీ సాయిబాబా వారి 19వ ఆలయ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 108 మంది కన్యలతో గౌతమి గోదావరి నుండి తీసుకొచ్చిన జలాలతో పాటు బాబాను ముత్యాల పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి గోదావరి జలాలతో పాటు 40 రకాల పండ్ల రసాలతో ఆలయంలో కొలువైన బాబాకు అభిషేకం, కలశ పూజ నిర్వహించి టన్నున్నర వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం నుండి రావులపాలెం, మండపేట, కడియం, ఆలమూరు మండలాలతో పాటు జిల్లా నలుమూలల నుండి బాబాను భక్తులు దర్శించుకున్నారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు.

previous post