కాలేయ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మట్టా రాకేష్ తెలిపారు. ఆదివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో గల కేర్ డయాగ్నస్టిక్ అండ్ స్కాన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత లివర్ క్యాంపు కార్యక్రమంలో వారు పాల్గొని రోగులకు ఉచితంగా ఓపి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి మందులను అందించారు. సూర్యాపేట జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆర్ సి పి సౌకర్యంతో ఎస్వీఆర్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో గత ఆరు సంవత్సరాలుగా కిడ్నీ వైద్య రంగంలో సేవలందిస్తూ ఇప్పుడు గ్యాస్ట్రో ఎండోస్కోపిక్ వైద్య సేవలను అందుబాటులో తీసుకొచ్చామని ప్రజలందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి పైగా రోగులకు వైద్య సేవలను అందించారు. ఉచితంగా ఓపి 5000 రూపాయల విలువ చేసే ఫైబ్రో స్కాన్, రక్త పరీక్షలు జరిపి రోగులకు సేవలు అందించినందుకు గాను డాక్టర్ మట్టా రాకేష్ కేర్ డయాగ్నస్టిక్ నిర్వాహకులను పలువురు అభినందించారు…………