Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి 

దౌల్తాబాద్: సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శేఖర్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మండల వనరుల కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఎంఈఓ కనకరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నడుస్తున్న నేటికి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లేదని అన్నారు. 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాడి రాజు, సంఘం సభ్యులు పెంటయ్య, నగేష్, చంద్రమౌళి, మల్లేశం, కేజీబీవీ సిబ్బంది మమత, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు….

Related posts

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న (04 ) ట్రాక్టర్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

TNR NEWS

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే……..  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి…..

TNR NEWS

సమయం ఎంతో విలువైనది..* — ఛాన్స్ లక్కీ క్లబ్ అధ్యక్షురాలు : లక్ష్మి

TNR NEWS

సి ఎం సహాయనిది చెక్కుల పంపిణీ 

TNR NEWS

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది

TNR NEWS

కొనసాగుతున్న సైన్స్ ఫేర్   ఆకట్టుకున్న ఐఆర్ బేస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ సిగ్నల్ అడ్జస్ట్మెంట్ 

TNR NEWS