పిఠాపురం : వ్యవసాయ కార్మికులకి జాతీయ ఉపాధి హామీ పనుల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని పనులు లేక ఉపాధి లేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్లక్ష్యం వీడి వెంటనే పనులు కల్పించాలని మంగళవారం వ్యవసాయ కూలి సంఘం నియోజవర్గ కార్యదర్శి పెరుమళ్ళ గోపాలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సాక రామకృష్ణ నవకండ్రవాడ ఉపాధి పనులు పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. యంత్రంగాలు ఉపయోగించి వ్యవసాయ పనులు చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని ఒకపక్క నిత్యవస ర ధరలు పెరిగిపోయి సామాన్యుడు కొనుక్కుని తినే పరిస్థితిలో లేవని ఉపాదామి కూలి మాత్రం పెంచడం లేదని ఆయిల్ ప్యాకెట్ దగ్గర నుంచి ఉప్పు పప్పు వాటర్ ప్యాకెట్ పాల్ ప్యాకెట్ వరకు అధిక ధరలు ఉన్నాయని ధరలకు అనుకూలంగా 600 రూపాయలు కూలి, 200 రోజులు పని దినాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వాసంశెట్టి బాబురావు, వాసంశెట్టి మణి, దడల అప్పయ్యమ్మ, మంగ తదితరులు పాల్గొన్నారు.