- వివి ప్యాట్ స్లిప్ లు లెక్కించే విధానం అమలు చేయాలి
- పౌరసంక్షేమ సంఘం
కాకినాడ : ఓటరు గుర్తింపుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న పౌర విజ్ఞప్తిని ఎన్నికల కమీషన్ నిర్వహణ చేపట్టేందుకు అంగీకరించడం పట్ల పౌర సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. అదే రీతిగా చట్ట సభలు స్థానిక సంస్థల్లో ఇవిఎం మెషిన్ల పై ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా జరిగే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆర్థిక డిపాజిట్ చేసి సవాల్ చేసే క్రమంలో వివి ప్యాట్ స్లిప్ లు లెక్కించే విధానాన్ని ప్రవేశపెట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. ఆధార్ కార్డు అనుసంధానం చేయడం వలన ఓటరు జాబితాలో దేశ వ్యాప్తంగా ఒక చోట మాత్రమే ఓటు నమోదు ఓటు హక్కు వినియోగం జరిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. డబుల్ ఎంట్రీలకు, దొంగ ఓట్ల నమోదుకు అవకాశం వుండదన్నారు. ఎన్నికల పోలింగ్ లో వేలిముద్రల గుర్తింపుతో దొంగ ఓట్లు వేసే అవకాశం తొలగుతుందన్నారు. ధనికులకు మాత్రమే చట్టసభల ప్రాతినిధ్యం ఎక్కువ వుతున్న దేశంలో తగిన ఎన్నికల సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం వుందని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణzరాజు సూచించారు.