ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాను సూపర్ స్టార్ మహేష్ బాబు షేక్ చేశారు. ఆయన జిమ్‌లో అద్దం ముందు చూసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.ఈ సినిమా కోసం యావత్తు భారతదేశం మొత్తం కూడా ఎంతో అతృతుగా ఎదురు చూస్తోంది. RRR సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమా ఇదే. ఇప్పటి వరకు ప్యాన్ ఇండియా రేంజ్‌లో హిట్లు కొట్టిన రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్‌పై గురి పెట్టారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని కథ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది.మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం ఈ సినిమాకు సంబంధించి రీరికార్డింగ్ పనులు మొదలుపెట్టారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. మహేష్ సినిమాపై దర్శకుడు రాజమౌళి బిగ్ ఆప్డేట్ ఇచ్చారు. సింహాన్ని లాక్ చేసినట్లుగా చూపించి మహేష్ బాబు పాస్‌పోర్ట్‌తో ఫొటోకు పోజ్ ఇచ్చారు.మహేష్ బాబుని లాక్ చేసానని పరోక్షంగా హింట్ ఇస్తూ అతని పాస్‌పోర్టును చూపిస్తూ ఫొటోకి ఫోజిచ్చారు.రాజమౌళి చేసిన పోస్టుపై మహేష్ బాబు సైతం రియాక్ట్ అయ్యారు.’ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అంటూ రాజమౌళి పోస్టుకు మహేష్ రిప్లై ఇచ్చారు. రాజమౌళి చేసిన పోస్టుకు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా స్పందించారు. ఎమోజీతో కూడిన సింబల్‌ను పోస్ట్ చేశారు. దీంతో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా నెగిటివ్ రూల్‌లో కనిపించనుందని సమాచారం.
ఈ సినిమాలో ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లెన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చెల్సియా ఇస్లెన్‌కి స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించారని సమాచారం అందుతోంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న తెరకెక్కించబోతున్నారు. సౌతాఫ్రికా అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేశారు.ఈ సినిమా కోసం మహేష్ తన లుక్స్ మొత్తం మార్చేశారు.తాజాగా మహేష్ బాబు జిమ్‌లోని వీడియో ఒకటి బయటకు వచ్చింది. మహేష్ బాబు లాంగ్ హెయిర్‌లో కనిపించారు. హల్క్ మాదిరిగా కనిపించాడు. జిమ్‌లో వర్కౌట్స్ చేసి బాడీని పెంచుతున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఫుల్ ఖషీ అవుతున్నారు.సింహం సిద్ధం అవుతుందని మహేష్ బాబు ఫ్యాన్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు జిమ్ వీడియో సోషల్ మీడియా రచ్చ లేపుతోంది.