Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణదిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ – జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలానికి చెందిన దుర్గాడ గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ఫిబ్రవరి 28వ తేదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2025-26 బడ్జెట్ ను రూ.3,22, 359కోట్ల రూపాయిలతో ఎంతో అద్భుతంగా ప్రవేశ పెట్టడం జరిగిందని, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గల పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం దిశగా బడ్జెట్ ను రూపొందిస్తూ, స్వర్ణాంధ్ర నిర్మాణం కొరకు అనేక నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో గల పేదవారికి నిత్యవసర సరుకులు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ, వ్యవసాయాధారిత రంగాలకు, సామాజిక పెన్షన్లు కొరకు, ఉత్పాదకత రంగాలకు ప్రాదాన్యతనిచ్చి స్వచ్చ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కూడా నిధులను కేటాయించిన వైనం స్వర్ణ అంధ్రప్రదేశ్ నిర్మాణానికి పూనాదులను వేసినట్టు అయ్యిందని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కొరకు సామాజికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో అన్ని శాఖలకు శాఖల వారీగా నిధులను కేటాయించడం జరిగిందన్నారు. సూపర్ 6లో తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా మరియు ఎంజిఎన్ఆర్ఈజిఎస్ కి నిధులను, ఎన్టీఆర్ జలసిరికి నిధులను కేటాయించడం జరిగిందన్నారు. బడ్జెట్‌లో సగం డబ్బులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడానికి‌ సరిపోతుందని జ్యోతుల శ్రీనివాసు వైఎస్ఆర్సీపీ పార్టీని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్టాడుతూ ప్రజలకు ఆశాజనకంగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం శాసనసభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్, ఆర్దిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితర మంత్రులకు, తెలుగుదేశం, జనసేన, బిజెపి శాసనసభ్యులకు జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు ధన్యవాదాలు తెలియజేశారు.

 

Related posts

స్వరూపానంద కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

TNR NEWS

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

TNR NEWS

పల్లె పండుగ తో గ్రామాలు సమగ్రాభివృద్ధి*

TNR NEWS

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

ఘనంగా కృష్ణాజిల్లా జంప్ రోప్ జట్ల ఎంపికలు 

TNR NEWS

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి