పిఠాపురం : పిఠాపురం పట్టణానికి చెందిన పీతల సత్యనారాయణ గత 35 సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలో తరించి 30 సంవత్సరాలు సర్వే డిపార్టుమెంటులో విశిష్ఠ సేవలందించి, వృత్తిలో అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా పదవీ విరమణ సన్మాన మహోత్సవము కార్యక్రమం సహోద్యోగులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాను చేసిన సేవలకు ఎటువంటి రిమార్కు లేకుండా తన పదవి విరమణ చేయడం చాలా ఆనందంగా ఉందని, తనకు తోడ్పాటును ఇచ్చిన తోటి ఉద్యోగస్తులకు, అధికారులకు మరియు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసారు. పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో భాగంగా పీతల సత్యనారాయణ, శాంతి కుమారి దంపతులను తహశిల్దార్ కార్యాలయ సిబ్బంది, కుటుంబ సభ్యులు పూల మాలలు వేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో , ఆర్ఐ, ముండల ల్యాండ్ సర్వే ఆఫీసర్స్, జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం నాయకులు, తహశీల్దారు సిబ్బంది, వి.ఆర్.ఒ.లు & గ్రామ సర్వేయర్లు, సిబ్బంది, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.