కాకినాడ : నగరంలోని మున్సిపల్ కార్మికు ల తరహాలో పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు రూ.21వేలు ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. నెలకు రూ.7వేల నుండి రూ.9వేల వేతనాలు ఇవ్వడం వలన వారి కుటుంబాలకు కడుపు నింపుకునే అవకాశం కలగడం లేదన్నారు. 551/132/57/142/680 జిఒల ప్రకారం పిఎఫ్, ఇఎస్ఐ ప్రమాద భీమా అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4నెలల నుండి 45నెలల మేరకు పంచాయతీల్లో కార్మిక వేతనాలు పెండింగ్ ఏర్పడటం దురదృష్ట కరమన్నారు. పంచాయితీల్లో పని చేసే ఎన్ఎంఆర్ లకు ప్రభుత్వ జీతాలు చెల్లించే ప్రణాళిక రావాలన్నారు. నగరాన్ని ఆనుకుని వున్న గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతు న్న కార్మికులకు కనీస వేతనాలు లేకపోవడం తగదన్నారు. నగరాల్లో విలీన గ్రామాల వ్యాజ్యా న్ని పరిష్కరించక పోవడం వలన పంచాయతీ కార్మికుల సమస్యలు తీవ్రతరంగా వున్నాయన్నారు.

previous post