మునగాల గ్రామంలోని వరి పొలాలను కోదాడ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్లయ్య, మండల వ్యవసాయ అధికారి రాజుతో కలిసి పొలాలను పరిశీలించడం జరిగింది.వరి పొలంలో ప్రస్తుతం అగ్గి తెగులు,కంపునల్లి, సుడిదోమ గుర్తించడం జరిగింది.దీనికి రైతులు తక్షణమే నివారణ చర్యలు పాటించాలని,లేనట్లయితే అధిక స్థాయిలో నష్టం వాటిల్లి దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రమ్య, భవాని, రేష్మ, నాగు మరియు రైతులు పాల్గొన్నారు
previous post
next post