మేడిపల్లి మండల పరిధిలోని మండల రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ వసంత, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్.పి.డి.ఒ పద్మావతి, మండల పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ శ్యామ్ రాజ్, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు లక్ష్మిపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ లో చైర్మన్ వినోద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ, బి.ఆర్.ఎస్ పార్టీ, బి.జె.పి పార్టీ కార్యాలయలలో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జండా ఆవిష్కరణ ను చేసి జాతీయ గేయాన్ని ఆలపించారు. అనంతరం స్విట్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు సందర్బంగా జనవరి 26న జాతీయ జెండా ఆవిష్కరించడం జరుగుతుందని, భారతీయులలో జాతీయ ఐక్యత, దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.