డిసెంబర్ 1న హలో మాల.. చలో సికింద్రాబాద్ లో నిర్వహించే మాలల సింహగర్జన సమావేశాన్ని విజయవంతం చేయాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పుల మల్లేష్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ముడిమ్యాల, తల్లారం, రావుల పల్లి గ్రామాల్లో సమతా సైనిక్ దళ్ స్థానిక నాయకులతో కలిసి మాలల సింహగర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హలో మాల.. చలో సికింద్రాబాద్.. మాలల సింహ గర్జన డిసెంబర్ 1న పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మాలలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాచనపల్లి రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు బేగరి ప్రభాకర్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు మల్లెపల్లి శ్రీనివాస్, ముడిమ్యాల మాజీ సర్పంచ్ శేరి దర్శన్, నాయకులు జగన్, దుద్దాగు సుదర్శన్, నర్సిములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
previous post