Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 200 మొబైల్ ఫోన్లను (సుమారు 25,68.997లక్షల విలువగల) బాధితులకు అందజేత.

రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న/ దొంగాలించబడిన సెల్ ఫోన్ ల స్వాధీనంకు సంబందించి సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో రామగుండము కమీషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు స్వాదినం చేసుకొన్నా సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్బంగా పోగొట్టుకున్న /దొంగలించబడిన సెల్ ఫోన్ల ఆచూకీ కనుగొని పోలీస్ స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల ను రామగుండము పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) చేతులమీదుగా సెల్ ఫోన్ యజమానులకు అందజేశారు.*ఈ సందర్భంగా సిపి CEIR గురించి వివరిస్తూ….* దొంగతనం కాబడిన కానీ లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ ల ఆచూకీ కోసం సిసిఎస్ తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, *రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 5280 సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయగా ఇందులో ఇప్పటి వరకు 1538 సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకొని సెల్ ఫోన్ యజమానులకు అందజేయడం జరిగిందని*, గత కొంతకాలంగా సిసిఎస్ ,ఐటి సెల్ పోలీసులు శ్రమించి మరో సుమారు *200* ల సెల్ ఫోన్ల ను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని, సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్ సి.ఇ.ఈ.ఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, రామగుండము పోలీస్ కమీషనరేట్ లో తేది 19-04-2023 నుండి ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు.ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ (https://www.ceir.gov.in) నందు బ్లాక్ చేసి, సంబందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.ప్రస్తుత జీవన శైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకం అయ్యిందని ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా,నగదు చెల్లింపులు చేయాలన్నా, ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా, మొబైల్ ఫోన్ పైనే ఆదారపడుతున్నామని అన్నారు.ఫోన్ పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్ లను వెతికి పెట్టడానికి కమీషనరేట్ పోలీస్ యంత్రాంగం పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) అనే అప్లికేషన్ ద్వారా చరవాణి ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా అట్టి చరవాణి లను వెతికి పట్టుకోవడానికి ఎంతో చేయూతనిస్తుందని అన్నారు. ఈ అప్లికేషన్ ముఖ్యంగా మొబైల్ ఫోన్ పోయినప్పుడు అట్టి మొబైల్ ఫోన్ పట్టుకోవాడానికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు.CEIR పోర్టల్ అనేది ప్రజలకు వారి మొబైల్ ఫోన్లు పోయిన లేదా దొంగిలించబడిన సందర్భాల్లో వెంటనే పోలీసులకు తెలియజేసి,వాటిని తిరిగి పొందేందుకు సహాయపడుతుంది.పోర్టల్‌లో ఎంటర్ చేసిన ఫోన్ వివరాలు ఇతర రాష్ట్రాల్లో,ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించగలగకుండా బ్లాక్ చేస్తుంది,దీంతో ఆ ఫోన్ వాడటం కష్టమవుతుంది.ఈ విధానం వల్ల చోరీలు తగ్గే అవకాశం ఉంది, ఫోన్లు తిరిగి పొందడం సులభమవుతోంది అన్నారు. ఫోన్ యజమానులు తమ ఫోన్లు తిరిగి పొందినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ మీట్‌లో పాల్గొన్న వారు,పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ,తమ జీవితాలలో ఈ సాయాన్ని చాలా విలువైనదిగా అభివర్ణించారు.మొబైల్ ఫోన్ రికవరీ లో పాల్గొన్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, సిసిఎస్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ఎస్ఐ లు ఏ మధుసూదన్ రావు కే నరేష్, బి జీవన్, ఎం చంద్రశేఖర్, ఎం శివకేశవులు, ఎన్ శ్రీధర్, బి భూమన్న, ఎన్. శామ్యూల్ పాల్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ దేవేందర్, ప్రేమ్ సింగ్, సత్తయ్య, హేమ సుందర్,దేవేందర్,కానిస్టేబుల్స్ రాజమౌళి, విష్ణు, జి సతీష్, జయచంద్ర, బి శ్రీనివాస్, భరత్, ఐటీ సెల్ కోఆర్డినేటర్ కో- ఆర్డినేటర్ హెడ్ కానిస్టేబుల్ రాము, బి.రమేష్,వి.రాజేందర్ లను సీపీ అభినందించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేకం.

TNR NEWS

హైవేపై వెలగని లైట్లు… వెలిగించాలని ఆఫీసర్లను వేడుకొన్న సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు

TNR NEWS

ద్విచక్ర వాహనం పట్టివేత

TNR NEWS

తల్లిదండ్రుల సమావేశం

TNR NEWS

మహిళా సంఘ డైరెక్టర్ గా ఆవుల విజయలక్ష్మి

TNR NEWS

మేడిపల్లి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు

TNR NEWS