క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఓటమి విజయానికి నాంది కావాలని అంతర్జాతీయ ఐపిఎల్ క్రీడాకారుడు బండారు అయ్యప్ప అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కటకమ్మ గూడెం రోడ్ లో గల మైదానంలో కోదాడ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేసి మాట్లాడారు. కోదాడలో క్రికెట్ తో పాటు క్రీడల అభివృద్ధికి లాజర్ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని యువత చెడు మార్గంలో నడవకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన విజేతలకు ట్రోఫీ లతోపాటు చెక్కులను అందజేశారు. వారం రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 30 జట్టులో పాల్గొనగా ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేట టీం, ద్వితీయ స్థానం కోదాడ బైపాస్ 11 టీం, తృతీయ స్థానం కోదాడ టీం, నాలుగో స్థానంలో కోదాడ టీచర్స్ టీం లు విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో క్రీడల నిర్వహకులు లాజర్, సన ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ నవమన్, పంది తిరపయ్య, షేక్ అలీమ్, రాజేష్, నాగప్రసాద్, అభి మస్తాన్, సైదయ్య తదితరులు పాల్గొన్నారు….
