Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు

విద్యార్థులు కష్టపడి చదివి తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న కలలను నెరవేర్చాలని ఐపీఎల్ క్రీడాకారుడు బండారు అయ్యప్ప అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అంతకుముందు సనా కాలేజీ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులు చిన్ననాటి నుంచి తమ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని సాధన కొరకు నిరంతరం కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు తమపై ఎన్నో కలలను కంటారని వాటి సకారం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం బండారు అయ్యప్పను శాలువా పూలబోకెతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎండి నౌమన్, ప్రిన్సిపాల్ నాగ ప్రసాద్, క్రికెట్ క్రీడాకారుడు లాజర్ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు……

Related posts

రైతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

TNR NEWS

కెనాల్ ఆయకట్టు గ్రామాలకు వెంటనే ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయాలి

Harish Hs

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

TNR NEWS

నేటికలెక్టరేట్ ముట్టడికి రైతాంగం తరలి రావాలి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయాలి సిపిఎం నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు

TNR NEWS

ఏ బస్సు చూసిన కాలేశ్వర పుష్కరాళ్లకే         మంథని బస్టాండ్ లో ప్రయాణికులు ఇబ్బంది ఉచితలకు అలవాటు పడ్డ ప్రజలు

TNR NEWS