సూర్యాపేట జిల్లా ప్రజలుకు ఎస్పీగా విలువైన పోలీసు సేవలు అందించిన సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు DIG గా ప్రమోషన్ పొంది వరంగల్ సిటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా వెలుతున్నందున ఈరోజు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించి DIG గారి దంపతులను సన్మానించారు. ఈ సందర్బంగా అదనపు ఎస్పి లు, DSP లు, CI లు మాట్లాడుతూ జిల్లాలో పటిష్టంగా పోలీసు సేవలను అందించారు, ఎస్పి గా మీరు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షలో బాగా పని చేశారు అని, వత్తిడి లేకుండా విధులు నిర్వర్తించాము అని అన్నారు.
అనంతరం DIG సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలకు, అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, ఈ జిల్లాలో సేవలు అందించడం, విధులు నిర్వర్తించడం మంచి అనుభవం అని అన్నారు. ఇతర పోస్టింగ్ లతో పోలిస్తే సూర్యాపేట జిల్లాలో పని చేయడం చాలా మంచి అనుభవం అన్నారు. ప్రతి ఒక్కరూ మంచిగా సహకరించారు, మంచిగా విధులు నిర్వర్తించారు. SP గా ఇది నాకు చివరి పోస్టింగ్ కావున సూర్యాపేట పోస్టింగ్ నాకు గుర్తుండిపోతుంది అన్నారు. జిల్లా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. అవకాశం వస్తె ఉన్నతాదికారిగా మళ్ళీ జిల్లా కు సేవలు అందిస్తాను అన్నారు.
ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ అడ్మిన్ నాగేశ్వరరావు, అధనపు ఎస్పి AR జనార్ధన్ రెడ్డి, DSP లు రవి, శ్రీధర్ రెడ్డి, AR DSP నరసింహ చారి, CI లు, SI లు సిబ్బంది ఉన్నారు.