Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

కోదాడ పట్టణంలో 10వ తరగతి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 11 సెంటర్లలో 2343 మందికి గాను 2339 మంది హాజరైనట్లు కేవలం నలుగురే గైర్హాజరైనట్లు తెలిపారు. సెంటర్లవారీగా తేజ స్కూల్ 153 మందికి 153 మంది హాజరు, బాలుర ఉన్నత పాఠశాల 234 మందికి 234 మంది హాజరు, శ్రీ చైతన్య శ్రీనగర్ కాలనీ 198 మంది కి 198 మంది సైదయ్య స్కూల్ 231 మందికి 230 మంది, సిటీ సెంట్రల్ 227 మందికి 227, కే టి ఎస్ 240 మందికి 240 మంది, సీసీ రెడ్డి 239 మందికి 239 మంది, ఎస్ఆర్ఎం స్కూల్ 167 మందికి 166 మంది జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ 239 మందికి 238 మంది శ్రీ వైష్ణవి స్కూల్ 240 మందికి 240 మంది SR PRIME లో 175 కు 174 మంది హాజరైనట్లు తెలిపారు మొత్తం మీద 99.82 శాతం విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ప్రతి సెంటర్లో సిట్టింగ్స్ స్వాడ్లను, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల గట్టి బందోబస్తును, ఆరోగ్య కార్యకర్తల ద్వార వైద్య సహాయం, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రశాంతంగా పరీక్షలు ముగిసాయన్నారు.

Related posts

రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి

TNR NEWS

రైతును ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం

Harish Hs

బిఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

జిల్లాలో సదర్ సమ్మేళన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Harish Hs

తెలంగాణ అభ్యర్థులు బిగ్ అలర్ట్.. గ్రూప్‌ 4 ఫలితాలు విడుదల..

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం  మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి. 

TNR NEWS