పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాయి బేడ (బుడ్గ) జంగం కులాన్ని ఎస్సీ కులాల లిస్టులో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చదివి వినిపించగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యడు కొణిదల పవన్ కళ్యాణ్ దీనికి పూర్తీ సహాయ సహకారాలు అందించారు. వీరు ఇరువురికి తూర్పుగోదావరి జిల్లా బేడ (బుడ్గ) జంగం సంఘం అభినందనలు తెలియచేసింది. దాదాపు 12 సంవత్సరాల నుండి ఏవర్గానికి చెందుతామో తెలియని పరిస్థితులలో కులధృవీకరణ పత్రాలు లేక పిల్లలకు చదువులు, ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న బేడ (బుడ్గ) జంగం కులానికి కూటమి ప్రభుత్వం వారి బాధలను అర్ధంచేసుకొని వారిని ఎస్సీ వర్గీకరణలోకి గ్రూపు ఏలో చేరుస్తూ తీసుకున్న నిర్ణయానికి తూర్పుగోదావరి జిల్లా బేడ (బుడ్గ) జంగం సంఘం అధ్యక్షుడు వేములూరి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బోణం రవిశంకర్, కోశాధికారి పెదపాటి వెంకటరమణ మరియు కార్యవర్గ సభ్యులు వేములూరి నాగేశ్వరరావు, పేర్రాజు, లోకనాథం సూర్య ప్రకాష్, గోళ్ళ నాగేశ్వరరావు, తూము రాంబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.

previous post