- మన ప్రాంత అభివృద్ధిలో జనసేన ముద్ర కనిపించే విధంగా మిత్ర పక్షాల నాయకులతో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయం
- రోలుగుంట మండలంలో జరుగుతున్న భారీ మైనింగ్ వల్ల కలుగుతున్న ఇబ్బందులని మైనింగ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్దాం
పిఠాపురం : చోడవరం నియోజకవర్గం నందలి రోలుగుంట, రావికమతం మండల నాయకులతో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గ్రామములనందు ప్రజలకు సంబంధించిన పలు కార్యక్రమాలను చర్చించి, వాటి సాధనకు అవసరమగు కార్యాచరణ రూపొందించారు. ఉపాధి హామీ పధకంలో చేసే పనులు పారదర్శకంగాను, ప్రజోపయోగంగాను ఉండే విధంగా ప్రతిపాదనలు సిద్ధంచేసి సంబంధిత అధికారులకు అందచేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాలను పాటిస్తూ స్థానిక శాసన సభ్యుడు మరియు కూటమి నాయకులతో సమన్వయంగా పనిచేయాలని, ఉగాదికి ప్రారంభం కాబోతున్న పి4 కార్యక్రమంలో పార్టీ నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలని నిర్ణయించారు. రోలుగుంట మండలంలో జరుగుతున్న భారీ మైనింగ్ కార్యకలాపాలవల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయా గ్రామ నాయకులు పేర్కొనగా ఈ అంశంపై పూర్తి సమాచారంతో అవసరమైన చర్యలు తీసుకునుటకు జిల్లా ఇంచార్జి మరియు మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రని కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.