Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలి

క్రైస్తవ ప్రబోధకుడు, గ్రంథాల పరిశోధకుడిగా పేరొంది హైదరాబాద్ నగర కేంద్రంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా సువార్తికుడిగా పని చేస్తున్న పగడాల ప్రవీణ్ గత మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి సమీపంలో మరణించడం క్రైస్తవ లోకానికి తీరని లోటని, ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ జె. సుదర్శనం అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో శాంతిర్యాలీ నిర్వహించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బిషప్ డాక్టర్ జె. సుదర్శనం మాట్లాడుతూ, ప్రవీణ్ పగడాల మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు గాని ప్రపంచ వ్యాప్తంగా ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇది మతఛాందసవాదులు చేసిన కుట్రలో భాగమేనని ఆయన దుయబట్టారు. పగడాల ప్రవీణ్ మృతిపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సమగ్ర విచారణ జరిపి, ప్రవీణ్ హత్యకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిణామాలు మరల పునరావృతం కాకుండా రాష్ట్రంలో క్రైస్తవ మందిరాలకు, క్రైస్తవ పాస్టర్లకు తగు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రైస్తవ మీడియా కన్వీనర్ జె జె శామ్యూల్ సన్, మునగాల మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్ష కార్యదర్శులు ఆదాము, సామ్యూల్ పీటర్, మండల సామాజిక కార్యకర్త గంధం సైదులు, కోదాడ టాన్ అధ్యక్షులు పి. పాల్ చారి, మోతే మండల అధ్యక్షులు ఎల్. లాజర్, పాస్టర్లు డేవిడ్ రాజు, జె. లుకా, వసంత్, ఓబద్య, ఎం. రాజేష్, జె. సమూయేలు, అబ్రాహాము రాజు, రక్షకన్, విలియమ్స్, ఇ. ఉదయ్, క్రైస్తవులు, యూత్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన 

TNR NEWS

*మొంథా తుపాన్ వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నవంబర్ 3న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి*   తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

ఓటు భవితకు బాట

Harish Hs

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

TNR NEWS

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆటోలతో ర్యాలీ. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్

TNR NEWS

అంబేద్కర్ ఆశయాలను ఆచరిద్దాం -రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు

TNR NEWS