పిఠాపురం : శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని పిఠాపురం పట్టణంలో ఉన్న శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పురుహూతికా కల్చరల్ అసోసియేషన్, మన ఊరు మన బాధ్యత ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాదం ఉదయ సూర్య ప్రకాష్ లక్ష్మీ కుమారి దంపతుల సౌజన్యంతో కవి సన్మానం ఏర్పాటు చేశారు. ఈ కవి సమ్మేళనంలో వారణాసి కామేశ్వర్ శర్మ, తటవర్తి సుబ్బారావు, ఆకొండి వెంకటలక్ష్మి, రేగళ్ల నీలకంఠ శర్మ, ఎస్.వి.వాసుదేవ రావు, మేకా మన్మధరావు, వి. బులిప్రసాద్, జి.ప్రమీల, బండి రాజ్ కుమార్, ఆకొండి విశ్వనాథ శాస్త్రి, కె.అప్పారావు, కంచుమర్తి భవానీ శ్యామల, మేడిది భవానీ తదితర కవులు పాల్గొని ప్రసంగించారు. వింజమూరి గాయత్రి శిష్య బృందంచే సంగీత విభావరి నిర్వహించారు. వారణాసి కామేశ్వర శర్మ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది విశిష్టతను తెలియజేశారు. ఏపిఎస్జీఆర్ఈ కె.పద్మనాభం, వ్యవసాయ పారిశ్రమికవేత్త పేకేటి నాగేశ్వరరావు, న్యాయవాది, గోకివాడ సర్పంచ్ కీర్తి హరినాథ్ బాబు, శ్యామ్ కోచింగ్ ఇనిస్ట్యూట్ జి.శ్యామ్, ఆధ్యాత్మిక, సామాజికవేత్త మేకా సూర్య ప్రకాష్, చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.రవి కుమార్, సంగీత ఉపాధ్యాయురాలు వింజమూరి గాయత్రి, పరిశోధకులు తటవర్తి సాయి వంశీకృష్ణ, డాక్టర్ అబ్బిరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు పీఠికాపుర ప్రతిభా పురస్కారాలు అందజేశారు. బాదం ఉదయ్ సూర్య ప్రకాష్, లక్ష్మీ కుమారి దంపతులు, ఆకొండి శివరామయ్య, వల్లి దంపతులకు ఉగాది విశిష్ట ఆదర్శ దంపతులు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన బాధ్యత అధ్యక్షుడు కొండేపూడి శంకర్రావు, కౌన్సిలర్ అల్లవరపు నగేష్ తదితరులు పాల్గొన్నారు.