పిఠాపురం : పిఠాపురం జర్నలిస్టు యూనియన్ కార్యవర్గం, సభ్యులు కలిసి సాధారణ సమావేశం స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఆవరణలో వున్న చెలికాని భావనరావు సభాసదన్‌లో సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ సంధర్భంగా అధ్యక్షుడు రాయుడు శ్రీనుబాబు పలు విషయాలపై చర్చించారు. పిఠాపురం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బాలెం నుకరాజును యూనియన్ గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంధర్భంగా బాలెం నూకరాజు మాట్లాడుతూ ముందుగా యూనియన్ కార్యవర్గానికి, సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని, జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. యూనియన్ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు బళ్ళ సురేష్, కోశాధికారి కె.రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు యాండ్ర శ్రీ వీరవెంకట సునీల్ కుమార్, ఎ.లక్ష్మణ్, బర్రె చిన్నబ్బాయి, దడాల సత్తిబాబు, కె.ఫణి, డి.కామేశ్వరరావు (దొరబాబు), డి.సతీష్, ఎం.కిషోర్, ఎం.రమేష్, కె.వి.వి.ఎస్.ఎన్.మూర్తి, సి.హెచ్.చిన్ని, కరుణ్‌రాజు, సి.హెచ్.సూర్యం, కె.శ్రీనివాస్, జి.శివశంకర్, ఎం.వి.సాగర్, జె.లోవరాజు, కండెల్లి శ్రీను, పి.జనార్ధన్ తదితరులున్నారు.