Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పోలీసు ప్రజా భరోసా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు తో కలిసి జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. దీనిలో భాగంగా గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను బలోపేతం చేసి పటిష్టంగా పని చేసేలా ప్రణాళిక చేయడం జరిగినది. స్టేషన్ పరిధిలో గుర్తించిన గ్రామాల్లో ప్రతి బుధవారం పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో సమస్యలు గుర్తించడం, చట్టాలపై, భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, సమస్యలు సృస్టించే వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇవ్వడం తద్వారా నేరాలను ఆధుపుచేయడం ఉద్దేశ్యం అని ఎస్పీ గారు తెలిపినారు.

 

సమీక్ష లో భాగంగా నేరాల నమోదు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్ శిక్షలు అమలు, డయల్ 100 కాల్స్, సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూ ఆర్ కోడ్ పని తీరు, ఫిర్యాదుల పై స్పందన, వాహనాల తనిఖీ, అనుమానిత వ్యక్తుల కదలికలు, రౌడి షిటర్స్ పై నిఘా, రోడ్డు ప్రమాదాల నిర్మూలన, సైబర్ మోసాల్లో నగదు రిఫండ్, దొంగతనాల కేసుల్లో కేసుల డిటెక్షన్ మొదలగు అంశాలను సమీక్షించారు. జిల్లాలో బుధవారం నుండి పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గ్రామ పోలీసు అధికారి (విపిఓ) వ్యవస్థను బలోపేతం చేసి ప్రతి గ్రామంలో విపిఓ ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాలి అని ఆదేశించారు.సీఐ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలో గల సమస్యత్మ గ్రామాన్ని గుర్తించి ప్రతి బుధవారం ఒక గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించాలి. తద్వారా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఏ చిన్న సంఘటనలు జరిగిన పోలీసులకు తెలుస్తుంది, గ్రామ ప్రజలతో కలిసిపోవడం వల్ల సమస్యలు సృష్టించే వారి గురించి తెలుస్తుంది. లోకల్ బాడి ఎన్నికలు వచ్చే నాటికి గ్రామాలు పోలీసు అధీనంలోకి వస్తాయి, ప్రశాంత గ్రామీణ వాతావరణం ఏర్పాటు చేయవచ్చు అన్నారు.

 

పోలీస్ శాఖ అంటే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే అత్యవసర శాఖ అని శాంతిభద్రత రక్షణ, పౌరులు భద్రత ముఖ్య విధి అన్నారు. ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ బాధితులకు భరోసా కల్పించాలి, ప్రణాళిక ప్రకారం పని చేసి నాణ్యమైన దర్యాప్తు చేయాలి అన్నారు. వర్గ విభేదాలకు సంభందించి భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమాచారం సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు. పోలీసు స్టేషన్ నందు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో నిపుణుల, అనుభవజ్ఞుల సలహాలు, అధికారుల సూచనలు తీసుకుని పరిష్కరించాలి. గ్రామాలు, కాలనీలు, పట్టణాలు ఇలా ఎక్కడైనా ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం వచ్చేలా వనరులు వృద్ధి చేసుకోవాలి, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అమశంపై సమాచారం, అవగాహన కలిగి ఉండాలని ఆన్నారు. డీఎస్పీ లు, సీఐ లు పోలీసు సిబ్బంది విధులపై, కేసుల దర్యాప్తు, స్టేషన్ నిర్వహణ పై నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. సివిల్ ఫిర్యాదుల్లో ఎవ్వరూ గొడవలు పెట్టుకోకుండా ఉండాలని ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి చట్టపరంగా పరిష్కరించుకోవాలి అని సూచించాలి అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పని చేయాలి. రౌడీలు, కేడీలు, షిటర్స్ పై నిఘా ఉంచి వారి ప్రస్తుత జీవన విధానం ఎప్పటికప్పుడు నమోదు చేయాలి అన్నారు. మళ్ళీ మళ్ళీ నేరాలకు పాల్పడకుండా, సమస్యలు సృష్టించకుండా బైండోవర్ చేయాలి అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. సైబర్ మోసాలపై, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నాగేశ్వరరావు, ఏ ఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పి మట్టయ్య, ఏఆర్ డిఎస్పి నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం,సీఐ లు చరమంద రాజు, రజిత, శివ శంకర్, రాజశేఖర్, వీర రాఘవులు, రామకృష్ణా రెడ్డి, రఘువీర్ రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హారిబాబు, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ, ఆర్ ఐ నారాయణ రాజు,ఎస్సై లు, సిబ్బంది ఉన్నారు.

Related posts

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ● ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు

TNR NEWS

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ 

TNR NEWS

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్

TNR NEWS

శాంతి భద్రతల పరిరక్షణలో సూర్యాపేట జిల్లా పోలీస్ పనితీరు అమోఘం.. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల కట్టడి పోలీసులు పారదర్శకంగా పనిచేయాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలి సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…

TNR NEWS

ప్రతిభ చూపితే ఉద్యోగ అవకాశాలు

TNR NEWS

ఐఏఎల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs