మునగాల మండల పరిధిలోని బరకత్ గూడెం గ్రామ సమీపంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కాలువలో ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన సంఘటన మంగళవారంచోటుచేసుకుంది ,
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, మోతే మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బొంతు వీరన్న అనే ఆటో డ్రైవర్ తన తమ్ముడి భార్య భవాని మరియు ముగ్గురు పిల్లల్ని తన ఆటోలో ఎక్కించుకొని తుమ్మలపల్లి నుండి కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో బరాకతి గూడెం గ్రామ సమీపంలోని ముక్త్యాల బ్రాంచ్ కాలువ వర్ధకు రాగానే కాలువ కట్ట పక్కనుండి మరొక ఆటో వేగంగా వీరన్న ఆటో మీదికి దూసుకు రాగా, వీరన్న ఒక్కసారి కంగారుపడి తన ఆటోను పక్కకు తప్పించేందుకు ప్రయత్నించగా, అదుపుతప్పిన ఆటో జారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది, ఈ సంఘటనలో డ్రైవర్ వీరన్నకు అతని తమ్ముడు భార్యకు మరియు ముగ్గురు పిల్లలకు స్వల్ప గాయాలు కాగా, కృష్ణానగర్ గ్రామానికి చెందిన కుమ్మరి జమున కు తీవ్ర గాయాలు అయ్యాయి, ప్రమాద సమాచారం తెలుసుకున్న మునగాల ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 సహాయంతో కోదాడ ప్రభుత్వవైద్యశాలకు తరలించారు, సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.