కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ బోర్డ్ అమెన్మెంట్ యాక్ట్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోదాడ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ ఆధ్వర్యంలో దుర్గాపురం క్రాస్ రోడ్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు.అనంతరం పలువురు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇటువంటి మతోన్మాద చర్యలు చేపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న లౌకికవాద వ్యతిరేక చర్యలు అన్నింటిని లౌకిక వాదులు ఖండించాలన్నారు. ప్రభుత్వం బిల్లు ను ఉపసంహరించుకోకపోతే యావత్ భారతదేశం ముస్లిం సోదరులు అన్ని ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మహమ్మద్ సాబ్, మౌలానా,షాబుద్దీన్ మదర్, బాజన్, ఖలీద్, రషీద్, శమీ, ఇమ్రాన్,బషీర్,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు………

previous post
next post