సూర్యాపేట:వికలాంగుల వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొండెందుకు నిబంధనలను కఠినతరం చేస్తూ 2016 ఆర్.పి డబ్ల్యు డి చట్టంలోని సెక్షన్ 20కి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసయిదాను నోటిఫికేషన్ గెజిట్ ను రద్దు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) జిల్లా కార్యదర్శి వీరబోయిన వెంకన్న డిమాండ్ చేశారు. సోమవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి ) ఆధ్వర్యంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూట్రైని ఐఏఎస్ పూజా ఖేడ్కర్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వైకల్య ధ్రువీకరణ పత్రం పొందెందుకు నిబంధనలు కఠినంతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సరైంది కాదుఅన్నారు.ఇప్పటి వరకున్న నిబంధనల ప్రకారం వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తూ దారులు నివాస రుజువు మరియు ఫోటో మాత్రమే సమర్పించాలన్నారు.సవరించిన నిబంధనల ప్రకారం 6నెలల లోపు దిగిన ఫోటో, ఆధార్ కార్డు తప్పని సరిగా సమర్పించాలన్నారు.వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్థులను స్వీకరించడానికి మరియు ప్రాసెస్ చేయడానికి వైద్య అధికారులు మాత్రమే సమర్థులుగా పరిగనించాలని ముసాయిదాలో సవరణలు ప్రతిపదించడం సరైంది కాదన్నారు.దరఖాస్థులను ప్రాసెస్ చేయడానికి పట్టే సమయాన్ని 1నెల నుండి 3నెలలకు పెంచాలని ప్రతిపాధన చేయడం అంటే వికలాంగులను ఇబ్బందులకు గురిచేయడమే అవుతుందన్నారు.
ప్రభుత్వం చేస్తున్న సవరణలు నకిలీ వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందకుండా ఆపలేవని, ప్రభుత్వం కొత్తగా పెడుతున్న నిబంధనలు నిజమైనా వికలాంగులు సర్టిఫికెట్ పొందడం కష్టమవుతుందన్నారు.గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వికలాంగులు సంక్షేమ పథకాలు పొందాలంటే యూ డి ఐ డి కార్డు తప్పని సరిగా ఉండాలని, యూ డి ఐ డి కార్డు కు ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయం చేసిందని ప్రస్తుతం యూ డి ఐ డి కార్డు జారీ చేయడానికి 6నెలల కంటే ఎక్కువ సమయం పడుతుందనారు. యూ డి ఐ డి కార్డులు జారీ చేయడానికి మరియు వైకల్య ధ్రువీకరణ పత్రం జరిచేయడానికి కావాల్సిన సమయాన్ని తగ్గించకుండా ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు.2016 డబ్ల్యూ ఆర్ డబ్ల్యు డి సెక్షన్ 18(2)ప్రకారం దరఖాస్తూ స్వీకరించిన నెలలోపు సర్టిఫికెట్స్ జారీ చేయాలని వైద్య అధికారులను ఆదేశిస్తుందని,మారిన సవరణ ప్రకారం వైకాల్యం నిర్ధారణ అయితేనే 3 నెలల లోపు సర్టిఫికెట్ జారీ చేయాలని సూచిస్తుందని అన్నారు.వైకల్య శాతన్ని బట్టి యూ డి ఐ డి కార్డులు జరిచేయాలని, 40 శాతం లోపు ఉన్నా వారికి తెలుపు కార్డు, 40-80 శాతం వైకాల్యం ఉన్నవారికి పసుపు కార్డు, మరియు 80 నుండి 100 శాతం ఉన్నావారికి బ్లు కార్డులు జారీ చేయాలని చేసిన
ప్రతిపాధన సరైనది కాదన్నారు. యూ డి ఐ డి కార్డులు వైకల్య శాతన్ని బట్టి కలర్లో జారిచేయడం అంటే వికలాంగుల మధ్య శత్రుత్వం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.సాటి వికలాంగుల మధ్య వివక్షత మరియు వేధింపులు పేరిగే అవకాశం ఉందని, యూ డి ఐ డి కార్డులో వికలాంగుల పూర్తి సమాచారం ఉంటుందని,అలాంటప్పుడు వైకల్య శాతం ఎందుకు బహిరంగoగా కనిపించేలా చేయాలని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వికలాంగులకు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది.
దరఖాస్తూ చేసిన 2 సంవత్సరాలలోపు సర్టిఫికెట్ రాకుంటే మళ్ళీ కొత్తగా దరఖాస్తూ చేయాలని ప్రతిపాదన చేయడం అంటే వికలాంగులను మరింత ఇబ్బందులకు గురిచేయడమే అవుతుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, వైకల్య ధ్రువీకరణ పత్రం పొందడానికి మార్గదర్శకాలు సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులకు జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు శిరం శెట్టి రామారావు, నాయకులు చిన్నపంగ నరసయ్య,రమేష్,వెంకట్,నాగేశ్వరరావు,ఆర్.వి తదితరులు పాల్గొన్నారు.