సూర్యాపేట: సీనియర్ జర్నలిస్ట్, మెట్రో దినపత్రిక సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఉయ్యాల నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ దశాబ్ద కాలం పైగా పత్రికా రంగంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకున్నారని అన్నారు. విశ్లేషణాత్మక కథనాలు అందిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా వార్తలు అందిస్తున్నారని తెలిపారు. భగవంతుడు ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు ని
జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ లు బంటు కృష్ణ, రాపర్తి మహేష్, కొండ శ్రీనివాస్ రావు,బచ్ఛు పురుషోత్తం, అయినాల శ్రీనివాస్, కొండ్లె కృష్ణయ్య,పి,మల్లి ఖార్జున్, దుర్గం బాలు,తండు వెంకటేష్ గౌడ్,దోస పాటి అజయ్ కుమార్, వల్దాస్ శంకర్, ప్రైమ్ నైన్ ప్రవీణ్,జి, ప్రభాకర్,ఎస్ ఎన్ 9పాషా, టిపి టి ఎల్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు జె, నరసింహారావు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్, సురేందర్,చంద్ర మౌళి, తదితరులు పాల్గొన్నారు