Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ

పిఠాపురం : పిఠాపురం మున్సిపల్‌ కార్యాలయం పక్కన మార్కెట్‌ సెంటర్లో పిఠాపురం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ (పిజెఏ) ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా పాత్రికేయులు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ జి.శ్రీనివాస్‌, పిఠాపురం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ (పిజెఏ) గౌరవాధ్యక్షుడు కొండేపూడి శంకర్రావులు విచ్చేసి రిబ్బన్‌ కటింగ్‌ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ జి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై తమ కలంతో గళాన్ని వినిపించే పాత్రికేయులు ఇలా సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని మండే వేసవితాపానికి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేలా పాత్రికేయులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ జీతభత్యాలు లేని పాత్రికేయులు తమ సొంత ఖర్చులతో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం ఒక సామాజిక సేవ కర్తగా తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. పిఠాపురం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రాయుడు శీనుబాబు ఈ అసోసియేషన్‌ తరపున ప్రతివారం నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేశామన్నారు. ఇందుకు సహకరిస్తున్న పిఠాపురం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు సెక్రెటరీ వేగా న్యూస్‌ ఛైర్మన్‌ శ్యాంప్రసాద్‌, ట్రెజరర్‌ ఆర్‌.కె.టివి రామకృష్ణ, మెంబర్స్‌ సింహగర్జన పత్రికా సంపాదకుడు సునీల్‌ కుమార్‌ యాండ్ర, ఆంధ్రరేఖ బ్యూరో దడాల సత్తిబాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌ దాకే సింహాచలం, మైటివి రిపోర్టర్‌ ఏ.లక్ష్మణ్‌, మనవార్త రిపోర్టర్‌ కిషోర్‌, ఆంధ్రరేఖ రిపోర్టర్‌ రమేష్‌, గళం రిపోర్టర్‌ డి.సతీష్‌, వెలుగు రిపోర్టర్‌ సోమేశ్వరరావు, ఆజాద్‌ రిపోర్టర్‌ పి.జనార్ధన్‌, ఆర్టీఐ రిపోర్టర్‌ కామేశ్వరరావు (దొరబాబు), భారత్‌ రిపోర్టర్‌ సాగర్‌, నేటిబ్రహ్మాస్త్రం రిపోర్టర్‌ బాలెం నూకరాజు, ఆంధ్రన్యూస్‌ రిపోర్టర్‌ కరుణ్‌ రాజు, రిపోర్టర్‌ వై.అనిల్‌, క్యాండిల్‌ మీడియా రిపోర్టర్‌ సూర్యం, జి.ఎస్‌.బి.వార్త రిపోర్టర్‌ చిన్నా, 5ప్లస్‌ మీడియా రిపోర్టర్‌ కె.శ్రీనివాస్‌, ఎన్‌.డి.ఎల్‌ న్యూస్‌ రిపోర్టర్‌ ఎన్‌.కృష్ణ, వై.యస్‌.ఎం.రిపోర్టర్‌ జొన్నాడ లోవరాజు, స్టేట్‌ రిపోర్టర్‌ ఫణి తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

Related posts

జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన నాదెండ్ల మనోహర్

Dr Suneelkumar Yandra

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

TNR NEWS

జామియా మసీదు వద్ద జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు పూర్తి చేయాలి – సిఎం హామీ పూర్తి చేయాలి

Dr Suneelkumar Yandra

ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వృద్ధాప్య ఫించన్ కల్పించాలి పౌరసంక్షేమ సంఘం

Dr Suneelkumar Yandra

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

Dr Suneelkumar Yandra

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra