అయ్యప్ప స్వామి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు ఘనంగా జరిపారు.పట్టణంలో వివిధ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుండి అయ్యప్ప స్వామికి తొమ్మిది రకాల అభిషేకాలు, గణపతి, సుదర్శన హోమాలు, పూర్ణాహుతి, మహా రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు గురుస్వాములు కన్నుల పండువగ నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కోదాడ అధ్యక్షులు వంగవీటి నాగరాజు, స్వామి పుల్లయ్య, బత్తిని కృష్ణ, చంద్రశేఖర్, వెంకటేష్, సత్యనారాయణ, జగనీ ప్రసాద్, మడత రవి, ఎర్నేని బాబు, పైడిమర్రి సత్తిబాబు, గుల్లపల్లి సురేష్, రమేష్, బొలిశెట్టి కృష్ణయ్య, ముండ్రా రంగారావు అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు………..