Tnrnews.in
తెలంగాణ

కుమారుడి పుట్టినరోజున అనాధాలకు అన్నదానం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు

మునగాల మండల పరిధిలోని ముకుందా పురం గ్రామం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో. ఎన్ టీ ఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం , కొనకంచి గ్రామానికి చెందిన గుత్తికొండ చిన్న వెంకటేశ్వర్లు, జ్యోతి దంపతుల కుమారుడు ప్రణవ్ మొదటి పుట్టినరోజు సందర్బంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా వారి కుటుంబాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా నిరాధారణకు గురై,ఎవరు లేని అనాధ వృద్ధులకు. అన్నదాన కార్యక్రమం. నిర్వహించడం సంతోషదాయకమన్నారు.ఇలా ప్రతి ఒక్కరు, ఆలోచిస్తే సమాజంలో ఏ ఒక్కరు ఆకలితో అలమటించే పరిస్థితి ఉండదని. కార్యక్రమం ఏదైనా సందర్భం ఏదైనా ప్రతి ఒక్కరూ ఇలా సేవాగుణంతో సేవా దృక్పథంతో ముందుకు వచ్చి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అనాధలకు అండగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బంధువులు, మిత్రులు,నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నేటి నుండి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

Harish Hs

ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

Harish Hs

శ్మశాన వాటికలు నిర్మించారు.విద్యుత్ సప్లై మరిచారు

TNR NEWS

విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

TNR NEWS

వేమూరి సత్యనారాయణ సేవలు అభినందనీయం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి.

Harish Hs

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు

Harish Hs