Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఆర్టీసీ లోపనిభారాలు తగ్గించాలి. వేధింపులు అపాలి. సిఐటీయూ

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు కార్మిక యూనియన్ కార్యకలాపాలాలకు అనుమతించాలని, కిలోమీటర్లు పెంపు, వేధింపులు ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, యాజామాన్యం చర్యలు తీసుకోవాలని సిఐటియు సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం. రాంబాబు, నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.మంగళవారం నాడు సిఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక డిపో గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయము లో తాము ఎన్నికల్లో గెలిస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తానని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిపేస్టో పొందుపరచిందని, ఏడాది పూర్తి అవుతున్నా సమస్యలు పరిష్కారం చేయలేదని, కొత్త సమస్యలు రోజురోజుకు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు.గత టీఆర్ యస్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలనే కాంగ్రెస్ పార్టీ కూడా వాటినే కొనసాగిస్తున్నట్లుగా కార్మికులు అభిప్రాయ పడుతున్నట్లు అన్నారు. సర్వీస్ కండిషన్స్ ఘోరంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.చట్ట విరుద్ధంగా రన్నింగ్ టైమ్ తగ్గించటం , రెస్టు టైమ్ పెంచటం వలన కార్మికులకు పని గంటల నియంత్రణ లేకపోవటం వలన కార్మికులు శారీరక, మానసిక అందోళనలకు చెంది అనారోగ్యా లకు గురైతున్నారని అన్నారు.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, కార్మికులు ఐక్యం అయి పోరాటం చేయ వలసిన అవసరం అనివార్యంగా ఏర్పడిదన్నారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాకలక్ష్మి మాట్లాడుతూ మహిళా కండక్టర్ లకు డ్యూటీ చార్ట్ లో సింగిల్ క్రూ వేయటం వలన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కుటుంబ బాగోగులు, ఇంటి పనులు వలన నేటికీ మహిళలు సమాజం లో స్వేచ్ఛ గా మన గలుగలేని పరిస్థితులు ఉన్నాయనిఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్మికుల, ఉద్యోగుల యెడల వివక్షత కొనసాగుతున్నదని దాని వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చెరుకు ఏకలక్ష్మి, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్, డిపో అధ్యక్షులు గుండు రమేష్, నాయకులు శ్రీనివాస్, వీరాస్వామి, ప్రసాద్, మల్లయ్య, నాగార్జున,రసూల్ తదితరులు పాల్గొన్నారు

Related posts

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల విద్యార్థులకు బ్రెడ్,పండ్లు పంపిణీ

Harish Hs

విద్యను ప్రజల హక్కుగా మలిచిన ఆజాద్…. కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్….

TNR NEWS

సీఎం రేవంత్ తో ములాఖత్ అయిన మద్దూర్ కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ఘనంగా ప్రతిభ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు

TNR NEWS

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం

TNR NEWS

మోది కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి నెలలో దేశ వ్యాప్తంగా పోరాటం నిర్వహిస్తాం ఎం సాయి బాబు సీఐటీయూ జాతీయ కోశాధికారి

TNR NEWS