మునగాల మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం నాలుగో సెంటర్లో శుక్రవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ సంధ్యారాణి మాట్లాడుతూ..
పోషణ పక్షం పథకం ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వాళ్ల ఆరోగ్యం పై శ్రద్ధ ఎలా వహించాలి, పోషకాలతో నిండిన ఆహార నియమావళిని ఎలా రూపొందించుకోవాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలన్నింటినీ కలిపి ఈ పోషణ పక్షం పథకాన్ని ప్రభుత్వం రూపొందించిందని అన్నారు.గర్భవతిగా నిర్దారణ అయినప్పటి నుంచి బిడ్డపుట్టి రెండు సంవత్సరాలు నిండే వరకు వేయి రోజుల పాటు పిల్లలకు మంచి పౌష్టికాహారం, సంరక్షణ పట్ల గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ కె అనిత, ఆయా ఎస్.కె రేష్మ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.