Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజలు అనుకున్నదే నేను మాట్లాడాను – ఎన్నికలు ఎప్పుడొచ్చినా బి ఆర్ ఎస్ ప్రభుత్వం రావడం,  సీఎం కెసిఆర్ కావడం ఖాయం

కాంగ్రెస్ ప్రభుత్వ 16 నెలల పాలనపై ప్రజలు ఈసడించుకుంటున్నారని అదే విషయాన్ని నేను మాట్లాడితే వక్రీకరిస్తూ మంత్రులు మాట్లాడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. తొగుట లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.. ఎక్కడికి వెళ్లినా హరిగోస పడుతున్నారని సామాన్య ప్రజలతో పాటు దేశ ప్రధాని సైతం కాంగ్రెస్ పాలనపై పెదవి విరుస్తున్నారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో అడవులపై కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు నడిపిస్తున్నారని పేర్కొన్నారని తెలిపారు..కాంగ్రెస్ హాయాంలో రియల్ ఎస్టేట్ కుంటుపడి పోయిందని, ఆపద వొస్తే నాలుగు గుంటలు అమ్ముకుందాము అనుకున్నా ఎవరు కొనడం లేదన్నారు.. అనుకున్న పనులు కావడం లేవని, ప్రభుత్వం ఎప్పుడు పోతే అప్పుడు బాగుండు అని సామాన్య ప్రజలతో పాటు, పారిశ్రామిక వేత్తలు, రియల్టర్లు, రైతులు కోరుకుంటున్నారని తాను పేర్కొనడం జరిగిందన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం రావడానికి సబ్బండ వర్గాలు సహకరించడానికి ముందుకు వొస్తున్నరన్నారు.. మీ ఎమ్మెల్యే లను కొనాల్సిన ఆగత్యం మాకు పట్టలేదని, మీకు మీ ఎమ్మెల్యే ల మీద నమ్మకం లేకనే మా బి ఆర్ ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యే లను గుంజుకున్నారని విమర్శించారు.. కెసిఆర్ కు తానే కాదు బీ ఆర్ ఎస్ కార్యకర్తలు కూడా ఆత్మ లు గానే ఉంటారని, గతంలో కెసిఆర్ ఆత్మ గా ఉన్న పొంగులేటి నేడు మంత్రి అయ్యాడని ఆయన విమర్శలు చేయడం విడ్డురంగా ఉందన్నారు..మా మీద విమర్శలు పక్కన పెట్టి మీ పార్టీ ని మీరు సక్క బెట్టుకోవాలన్నారు.. మీ పార్టీ ఎమ్మెల్యే లైన ప్రేమ్ సాగర్, రాజగోపాల్ రెడ్డి ఎం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు..మీరన్నట్లు నాతో పాటు నార్కో అనాలసిస్ పరీక్షలు మీ మంత్రులకు, ఎమ్మెల్యే లకు కూడా కూడా నిర్వహించాలని కోరారు.. కెసిఆర్ రుబాబు గా పరిపాలన చేశాడని, మీ లెక్క డైవర్శన్ పాలిటిక్స్ చేయలేదని ఆయన పేర్కొన్నారు.. ప్రజలకిచ్చిన హామీలు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యే గా గెలిచి ఏడాది గడిచినా పైసా నిధులు ఇవ్వలేదన్నారు. డిపాజిట్ కోల్పోయిన రాజకీయ నాయకుడి తో కొబ్బరికాయలు కొట్టిస్తున్నారని, అధికారులు జీ హుజూర్ అంటున్నారని మరి వారిని అసెంబ్లీ లో కూర్చో పెడితే సరిపోతుందని ఆయన విమర్శించారు..మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మాకు సంస్కారం నేర్పించారని మంచి చేస్తే శభాష్ అంటామని, చెడు చేస్తే విమర్శిస్తామన్నారు..సీఎం రేవంత్ రెడ్డి దుబ్బాక కు సమీకృత హాస్టల్, స్కిల్ యూనివర్సిటీ మంజూరు చేస్తే కృతజ్ఞతలు తెలిపామన్నారు.. తాను స్వయం కృషి తో ఏదిగానని, పైరవీల కోసం, కాంట్రాక్టుల కోసం, కమీషన్ ల కోసం రాజకీయాల్లోకి రాలేనన్నారు.. నా మీద విమర్శించే వారు ముందు మీ గతం ఏందో చెప్పాలన్నారు..

ఎన్నికలు ఎప్పుడొచ్చినా బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, కెసిఆర్ సీఎం కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు..

Related posts

వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

Harish Hs

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్

TNR NEWS

లింగ నిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలు “ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ స్కానింగ్ సెంటర్ల దోపిడి పై చర్యలు తీసుకోవాలని”

TNR NEWS

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో విద్యార్థి,యువతరం ఉద్యమించాలి

TNR NEWS

పల్లె గ్రామాల్లో ఘనంగా ఎలా మాస పండుగా

TNR NEWS