Tnrnews.in
తెలంగాణ

పీడీఎస్ బియ్యం పట్టివేత…. 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు….

 

నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ను ఇతరుల దగ్గర తక్కువ రేటుకు కొని మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

 

వివరాల్లోకి వెళితే…

 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు కేరమేరి మండలం లోని వివిధ గ్రామాల నుండి మహారాష్ట్ర కి పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు కెరమేరి మండల లోని అనర్పల్లి గ్రామం లో తణిఖీలు చేపట్టారు. అనార్పల్లి గ్రామానికి చెందిన భానోత్.విజయ్ కుమార్ కి చెందిన బొలెరో పికప్ బండి AP 01 Y 0308 ను ఆపి అందులో తనిఖీ చేపట్టగా అందులో అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను,పట్టుకొని కేరమేరీ పోలీస్ స్టేషన్ కు తరలించి ఒకరిపై కేసు నమోదు చేసినట్ల్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ తెలిrపారు.

ఈ తనిఖీలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ వెంకటేష్ , టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ రమేష్, సంజీవ్, దేవేందర్ లు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా స్వరూప రాణికి అవార్డు

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి  ధాన్యం తరరలింపులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి  రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ 

TNR NEWS

డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువత పని చేయాలి

TNR NEWS

పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్,38 వాహనాలు సీజ్

TNR NEWS

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

Harish Hs

వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్.. సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం

TNR NEWS