బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని కోదాడ మాజీ ఎమ్మెల్యే ,బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు, మండల కేంద్రానికి చెందిన స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వీరబోయిన శ్రీను ఇటీవల ప్రమాదానికి గురై ఇంటి వద్ద చికిత్స పొందుతుండగా ఆదివారం రాత్రి ఆయనను పరామర్శించిన అనంతరం వారుమాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటానని పార్టీకి విధేయుడుగా ఉన్నా వీరబోయిన శీను కుటుంబానికి అన్ని రకాలుగా తాను అండదండగా ఉంటానని తెలిపారు, కార్యక్రమంలో మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ,బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొగరు రమేష్, పార్టీ నాయకులు సుంకర అజయ్ కుమార్, ఉడుం కృష్ణ, ఎల్పి రామయ్య, లక్య నాయక్, చీకటి శ్రీను, వసంత్ కుమార్, నరసింహారావు, గురుమూర్తి ,రవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.