మునగాల మండల ప్రజలకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ సోమవారం మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో మండల ప్రజలకు ముందస్తుగా ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలని, మంచి ఆరోగ్యం అందించాలని ఆయన ఆకాంక్షించారు.
2025వ సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని, ఆకాంక్షలు, లక్ష్యాలు, విజయాలు సాధించాలన్నారు. యువకులు ఒక లక్షాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అన్నారు.